2021లో 40 వరకూ బ్యాంక్ సెలవులు!

  • సెలవులను ప్రకటించిన ఆర్బీఐ
  • రెండు, నాలుగు శనివారాలు సెలవు
  • కొన్ని రాష్ట్రాల్లోనే సంక్రాంతి సెలవు
మరో 3 రోజుల్లో మొదలు కానున్న కొత్త సంవత్సరంలో బ్యాంకులకు 40కి పైగా సెలవులు రానున్నాయి. ఈ మేరకు సెలవుల జాబితాను ప్రకటిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెలా 2, 4వ శనివారాలు ఇప్పటికే సెలవులుగా ఉన్న సంగతి తెలిసిందే. వాటితో పాటు జనవరి 26 (రిపబ్లిక్ డే), ఫిబ్రవరిలో ఆదివారాలు మాత్రమే సెలవులని ఆర్బీఐ ప్రకటించింది.

మార్చి 11న (మహా శివరాత్రి), 29న (హోలీ) సెలవులు రానుండగా, ఏప్రిల్‌ 1న (గురువారం) ఖాతాల ముగింపు రోజు. ఆపై  2వ తేదీ (గుడ్‌ ఫ్రైడే), 14 (అంబేద్కర్  జయంతి) రానున్నాయి. మేలో 13న రంజాన్, జూలై 20న బక్రీద్, ఆగస్ట్ 19న మొహర్రం, 30న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్‌ 10 (వినాయక చవితి) సెలవులు ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది.

ఆ తరువాత అక్టోబర్ 2 (గాంధీ జయంతి), 16 (దసరా), నవంబర్ 4 (దీపావళి), 19న గురునానక్ జయంతి, డిసెంబర్ 25 (క్రిస్మస్) సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇదిలావుంచితే, సంక్రాంతి (జనవరి 14)న కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలవు అమలవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.


More Telugu News