మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ.. సింధియా వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు
- కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోవడంలో సింధియా కీలక పాత్ర
- ఆయన వర్గంలోని 12 మందికి మంత్రి పదవులు
- శివరాజ్ కేబినెట్‌లో 31కి పెరిగిన మంత్రుల సంఖ్య
మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణమైన జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న నిర్వహించిన మంత్రి వర్గ విస్తరణలో తులసీరాం సిలావత్, గోవింద్ రాజ్‌పుత్‌లకు మంత్రి పదవులు అప్పగించారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిద్దరితో కలిసి సింధియా వర్గానికి చెందిన మొత్తం 12 మందికి మంత్రి పదవులు లభించాయి. అలాగే, చౌహాన్ కేబినెట్‌లోని మొత్తం మంత్రుల సంఖ్య 31కి పెరిగింది.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తులసీరాం, గోవింద్‌లు ఇద్దరూ గతేడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నవంబరులో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ ఘన విజయం సాధించారు. మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీ 19 స్థానాల్లో గెలవడంతో ప్రభుత్వం కుప్పకూలిపోకుండా నిలిచింది. కాంగ్రెస్ 9 స్థానాలతో సరిపెట్టుకుంది.