బినామీ ఆస్తుల కేసు.. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఐటీ అధికారులు
- 8 గంటలపాటు వాద్రాను ప్రశ్నించిన అధికారులు
- బికనేర్‌లో కొనుగోలు చేసిన భూమిపై ప్రశ్నలు
- కక్ష సాధింపులో భాగమేనన్న వాద్రా
బ్రిటన్‌లో అప్రకటిత ఆస్తులు, నగదు అక్రమ చలామణికి సంబంధించిన కేసులో సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా (52)ను నిన్న ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్ ప్రాంతంలో ఉన్న వాద్రా నివాసానికి వెళ్లిన అధికారులు దాదాపు 8 గంటలపాటు ఆయనను ప్రశ్నించారు.
రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఆయన సంస్థ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలను నమోదు చేసుకున్నారు. నిజానికి దర్యాప్తులో భాగంగా ఐటీ కార్యాలయానికి వాద్రా వెళ్లాల్సి ఉండగా, కొవిడ్ నిబంధనల కారణంగా రాలేకపోతున్నట్టు చెప్పారు. దీంతో అధికారులే వాద్రా నివాసానికి వెళ్లారు. వాద్రా మాట్లాడుతూ.. రైతుల ఉద్యమానికి తన భార్య ప్రియాంక గాంధీ మద్దతు తెలిపినందుకే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.