బర్డ్ ఫ్లూ ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని భరోసా!
- 300 మంది అధికారుల నేతృత్వంలోని బృందాలు పని చేస్తున్నాయి
- ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు
- అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
ప్రస్తుతం మన దేశంలో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు కొత్త ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇంకా కరోనా నుంచి కోలుకోకముందే బర్డ్ ఫ్లూ రావడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ పశు సంక్షేమ భవన్ లో ఈరోజు ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులను పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, 300 మంది అధికారుల నేతృత్వంలోని బృందాలు నిరంతరం వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నాయని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని... ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగే ఫ్లెమింగ్ ఫెస్టివల్ కు 56 దేశాల నుంచి వలస వచ్చే సందర్భాల్లో మాత్రమే ఈ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని అన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ జబ్బు వచ్చే అవకాశం లేదని చెప్పారు.