శరద్ పవార్ తో సోనూసూద్ భేటీ
- పలు అంశాలపై చర్చ?
- మర్యాదపూర్వకంగానే కలిశానంటోన్న సోను
- ఇటీవల సోనుపై బీఎంసీ పోలీసులకు ఫిర్యాదు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ను ఆయన నివాసంలో సినీ నటుడు సోనూసూద్ ఈ రోజు ఉదయం కలిశారు. కాసేపు పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని సోనూసూద్ చెబుతున్నారు. దీని వెనుక ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని అంటున్నారు.
అయితే, మహారాష్ట్రలోని జుహూ ప్రాంతంలో తన ఆరు అంతస్తుల నివాస భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్ గా మార్చారంటూ సోనూ సూద్ పై బృహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పోలీసులకు ఇటీవలే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్ పవార్ ను సోనూసూద్ కలవడం పట్ల పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.