కర్ణాటకలో ఉన్న ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేస్తాం: సీఎం ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు
- కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలు
- సుదీర్ఘకాలంగా పోరాటం
- 1956 ఘర్షణలో పలువురి మృతి
- నాటి నుంచి జనవరి 17న సంస్మరణ దినం
కర్ణాటకలో మరాఠీ మాట్లాడే కొన్ని ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. మహా సీఎం చేసిన ఈ వ్యాఖ్యల వెనుక చాలా చరిత్ర ఉంది.
ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఈ ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీ ఏలుబడి కింద ఉండేవి. అయితే ఆ ప్రాంతాలు మహారాష్ట్రకు చెందినవేనని, వాటిని మహారాష్ట్రలో కలపాలంటూ మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తోంది. 1956 జనవరి 17న జరిగిన ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు విడిచారు. అప్పటినుంచి జనవరి 17న మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాకరే కార్యాలయం ట్వీట్ చేసింది. కర్ణాటక అధీనంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకు తాము అందించే ఘన నివాళి అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు తాము వాగ్ధానం చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.