ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది సునీల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

  • క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో నిన్న అమ్మాయిపై ప్రేమోన్మాది దాడి
  • ఆసుప‌త్రిలో అమ్మాయి ప‌రిస్థితి విష‌మం
  • మూడు  నెల‌లుగా అమ్మాయి వెంట ప‌డ్డ సునీల్
  • నిన్న ఆమె ఇంటికి వెళ్లి దాడి
క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో నిన్న ఓ యువ‌తిపై సునీల్ అనే ప్రేమోన్మాది దాడికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఓ అమ్మాయిని మూడు నెల‌లుగా వేధిస్తోన్న సునీల్ అనే యువ‌కుడు నిన్న‌ ఆ యువ‌తిపై క‌త్తితో దాడి చేయ‌డంతో ఆమె తీవ్ర‌గాయాలపాలై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

ఆమె కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించి, ఎట్ట‌కేల‌కు నిందితుడు సునీల్‌ను ప‌ట్టుకున్నారు. అత‌డు ప్రొద్దుటూరు రైల్వే స్టేష‌న్ వ‌ద్ద  ఉన్న‌ట్లు గుర్తించిన పోలీసులు అక్క‌డికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో త‌దుప‌రి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని, ఇందులో ఇంకా ఎవ‌రి ప్ర‌మేయం ఉంద‌న్న అంశాల‌పై ఆరా తీస్తున్నామ‌ని పోలీసులు వివ‌రించారు.

యువ‌కుడి చేతిలో గాయాల‌పాలైన యువ‌తి ప్రొద్దుటూరు పట్టణం నేతాజీనగర్లో నివ‌సించేంద‌ని, ఆమె ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం, బీటెక్‌లో చేరే ప్రయత్నాల్లో ఉండ‌గా స్వరాజ్‌నగర్‌కు చెందిన సునీల్‌ అనే యువకుడు ఆమె వెంట ప‌డుతున్నాడు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంట్లో ఒంట‌రిగా ఉన్న అమ్మాయిపై క‌త్తితో దాడి చేశాడు.


More Telugu News