కరోనా వ్యాక్సిన్ పై పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: కేంద్రం

  • భారత్ లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ పంపిణీ
  • జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్
  • వ్యాక్సిన్ సామర్థ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కేంద్ర హోంశాఖ
  • తప్పుడు ప్రచారం చేసేవారిని గుర్తించాలని సీఎస్ లకు లేఖ
భారత్ లో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, తాము అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ సామర్థ్యంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, కరోనా వ్యాక్సిన్ పై పుకార్లు వ్యాపింప చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నవారిపై ఓ కన్నేసి ఉంచాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

నష్టం కలిగించేలా కథనాలు ప్రసారం చేస్తూ, దుష్ప్రచారంలో పాలుపంచుకుంటున్న వారిని గుర్తించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్ లకు లేఖ రాశారు. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్ వ్యాక్సిన్ లు సురక్షితమైనవని కేంద్రం ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.


More Telugu News