వైభవంగా జరుగుతున్న రామతీర్థం విగ్రహాల ప్రతిష్ఠ!
- కొత్త విగ్రహాల ప్రతిష్ఠాపన నేడు
- ప్రత్యేక పూజలు చేసిన రుత్వికులు
- నేటి నుంచి బాలాలయంలో స్వామి దర్శనం
విజయనగరం జిల్లా రామతీర్థంలో గుర్తు తెలియని దుండగుల చేతిలో దెబ్బతిన్న విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాల ప్రతిష్ఠాపన నేడు జరగనుంది. నేడు బాలాలయంలో ప్రతిష్ఠ జరుగనుండగా, ఇప్పటికే ప్రత్యేక పూజలు మొదలైపోయాయి.
అష్టకలశ స్నపనం, పంచగవ్యం పూజలను నిర్వహించిన రుత్వికులు, ఆపై ప్రతిష్ఠ నిమిత్తం విగ్రహాలను బాలాలయానికి తరలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదిక్ వర్శిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయ అర్చకులు ఈ ఉదయం 8.58 గంటలకు ప్రతిష్ఠను పూర్తి చేయనున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ విగ్రహాలను తిరుపతి శిల్ప కళాశాల నుంచి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే.