తమిళనాడులో స్థానికులతో కలిసి బిర్యానీ తిన్న రాహుల్.. వీడియో ఇదిగో
- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాహుల్ పర్యటన
- స్థానికులతో కలిసి మష్రూం బిర్యానీ తిన్న కాంగ్రెస్ నేత
- వంట చేసిన ‘విలేజ్ కుకింగ్ ఛానల్’ నిర్వాహకులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్థానికులతో కలిసి మష్రూం బిర్యానీ తిన్నారు. ఈ వంటకం చేయడం అతి తక్కువ మందికి వచ్చట. ‘విలేజ్ కుకింగ్ ఛానల్’ అనే యూట్యూబ్ చానెల్ నిర్వాహకులు ఈ వీడియో అప్లోడ్ చేశారు.
ఆ ఛానల్ నిర్వాహకులు రకరకాల వంటకాలను వండి ప్రేక్షకులకు నేర్పిస్తుంటారు. రాహుల్ గాంధీ తమ ప్రాంతంలోకి వచ్చాడని తెలుసుకున్న ఆ ఛానల్ నిర్వాహకులు పొలాల్లోకి వంట సామగ్రిని తీసుకొచ్చారు. మష్రూం బిర్యానీని వెంటనే చేసి రాహుల్ కి పెట్టారు.
అంతేగాక పెరుగు రైతాను రాహుల్ స్వయంగా తయారు చేశారు. రైతా ఎలా చేయాలో వారు చెబుతుండగా రాహుల్ వారి సూచనల ప్రకారం రైతా తయారు చేశారు. వారితో అక్కడే కూర్చుని చాలా సేపు మాట్లాడారు. తమిళనాడుకు మాత్రమే ఈ వంటకాలను పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి అక్కడి వంటలను కూడా నేర్చుకుని యూట్యూబ్లో పెట్టాలని వారికి రాహుల్ సలహా ఇచ్చారు.
కరూర్ ఎంపీ జ్యోతిమణి సెన్నిమలై ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఛానల్ నిర్వాహకులు తమిళంలో ఏమేం చెబుతున్నారన్న విషయాన్ని రాహుల్ కి ఇంగ్లిష్లో ఆమె వివరించారు. వారు వండిన బిర్యానీని వారితో కలిసి రాహుల్ తిన్నారు.