పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న బీఎస్పీ నేత హర్ వీర్!

  • యూపీలోని బదాయూ సమీపంలో ఘటన
  • స్థలం క్రమబద్దీకరణకు తిరిగిన హర్ వీర్
  • విసిగి, మనస్తాపంతో ఆత్మహత్య
బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన నేత హర్ వీర్, విషాహారం తిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యూపీలోని తహసీల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బదాయూ జిల్లా పరిధిలోని సహస్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో నివసిస్తున్న హర్ వీర్ పదేళ్ల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశారు.దాన్ని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న అతను, పలుమార్లు ఇప్పటికే ఎస్డీఎం‌ను కలిశారు.

పదేపదే తిప్పించుకోవడం మినహా వారు మరేమీ చేయకపోవడంతో ఎస్డీఎంతో గొడవకు కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే హర్ వీర్ ను సోమవారం నాడు రావాలని అధికారులు చెప్పడంతో, అప్పటికే విసిగిపోయిన ఆయన, విషం కలిపిన ఆహారం తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హర్ వీర్ ను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.



More Telugu News