ఆరు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డ్డ టీమిండియా

  • టీమిండియా స్కోరు 36 ఓవ‌ర్ల‌కు 121/6
  • క్రీజులో కోహ్లీ (27), అశ్విన్ (1)
  • ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 ప‌రుగులు
  • రెండో ఇన్నింగ్స్‌లో 178 ప‌రుగులు
భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య చెన్నైలో జ‌రుగుతోన్న తొలి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ చివ‌రిరోజు ఆట‌లో భార‌త్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. వ‌రుస‌గా వికెట్లు కోల్పోతోంది. రోహిత్ శ‌ర్మ 12, శుభ్‌మ‌న్ గిల్ 50, పుజారా 15, అజింక్యా ర‌హానె 0, రిష‌భ్ పంత్ 11, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 0 ప‌రుగుల‌కే ఔట‌య్యారు. ప్ర‌స్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 27, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 1 ప‌రుగుతో ఉన్నారు.

టీమిండియా స్కోరు 36 ఓవ‌ర్ల‌కు 121/6 గా ఉంది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అండ‌ర్సన్ 3, జాక్ లీచ్ 2, డామ్ బెస్ 1 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578, రెండో ఇన్నింగ్స్‌లో 178 ప‌రుగులు చేసి ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 ప‌రుగులు చేసింది. భార‌త్ ఇంకా 295 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. టీమిండియా చేతిలో మ‌రో నాలుగు వికెట్లే ఉండ‌డంతో ఇంగ్లండ్ గెలిచే అవ‌కాశాలే అధికంగా ఉన్నాయి.


More Telugu News