కృష్ణా జిల్లాలో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ పీఠం ఎగరేసుకెళ్లిన వైసీపీ మద్దతుదారుడు
- కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
- వెలువడుతున్న ఫలితాలు
- కందలంపాడు సర్పంచ్ గా నాగరాజు విజయం
- ఫలితాన్ని నిర్దేశించిన ఒక్క ఓటు
ఏపీ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కందలంపాడులో ఆసక్తికర ఫలితం వచ్చింది. కందలంపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బైరెడ్డి నాగరాజు విజయం సాధించారు. నాగరాజు వైసీపీ మద్దతుదారుడు. విశేషం ఏంటంటే, నాగరాజు కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.
కందలంపాడు చాలా చిన్న గ్రామం. ఈ గ్రామంలో మొత్తం ఓట్లు 203. నాగరాజుకు 102 ఓట్లు రాగా, అతని ప్రత్యర్థి సుబ్రహ్మణ్యంకు 101 ఓట్లు లభించాయి. కేవలం ఒక్క ఓటు నాగరాజుకు సర్పంచ్ పీఠాన్ని ఖరారు చేసింది. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఏమార్పు లేకపోవడంతో నాగరాజే విజేత అంటూ అధికారికంగా ప్రకటించారు.