షర్మిల పార్టీపై హరీశ్ రావు స్పందన
- ఇక్కడి రైతుల గురించి వారికి ఏం తెలుసు?
- రాజన్న రాజ్యం అని మొసలి కన్నీరు కారుస్తున్నారు
- ఎక్కడి నుంచో వచ్చి రైతులకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు
తెలంగాణలో రాజకీయ పార్టీని వైయస్ షర్మిల ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ గురించి వారికి కనీస పరిజ్ఞానమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణలోని రైతులకు అన్యాయం జరుగుతోందని అంటున్నారని... ఇక్కడి రైతుల గురించి వారికి ఏం తెలుసని మండిపడ్డారు. రాజన్న రాజ్యం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని అన్నారు. ఏపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉందా? అని ప్రశ్నించారు. ఏపీలో రైతులకు ఎంత భూమి ఉన్నా కేవలం రూ. 12,500 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు అందిస్తున్నామని చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మాటలు చెపితే ఎవరూ నమ్మరని అన్నారు.