యజమాని పుణ్యమా అని కుక్క కోటీశ్వరురాలైంది!
- లులూ అనే కుక్క పేరిట రూ.36 కోట్లు ఆస్తి రాసిన యజమాని
- గతేడాది మరణించిన యజమాని
- వీలునామాలో ఆస్తి బదలాయింపు
- కుక్కను స్నేహితురాలికి అప్పగించిన యజమాని
ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అని ఓ నానుడి ఉంది! ఈ అమెరికా కుక్క విషయంలో అది నిజమైంది! తన యజమాని ద్వారా ఆ శునకానికి కోట్ల ఆస్తి కలిసొచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.... ఎనిమిదేళ్ల వయసున్న బోర్డర్ కోలీ జాతికి చెందిన కుక్క పేరు లులూ. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్ విల్లే ప్రాంతానికి చెందిన బిల్ డోరిస్ అనే వ్యక్తి లులూ యజమాని. బిల్ డోరిస్ గతేడాది మరణించాడు. అయితే తన వీలునామాలో కుక్క పేరిట 5 మిలియన్ డాలర్ల (రూ.36 కోట్లు) ఆస్తిని రాశాడు.
ఆ డబ్బును ఓ ట్రస్టుకు బదిలీ చేసి, తన పెంపుడు కుక్క బాగోగులు చూసేందుకు వినియోగించాల్సిందిగా డోరిస్ తన వీలునామాలో పేర్కొన్నాడు. డోరిస్ తన మరణానికి ముందు లులూను తన స్నేహితురాలు మార్తా బర్టన్ కు అప్పగించాడు. ఇకపై లులూకు బర్టన్ ఖర్చు చేసే ప్రతి రూపాయి ట్రస్టు ద్వారా రీయింబర్స్ మెంట్ విధానంలో తిరిగి చెల్లించబడుతుంది.
దీనిపై బర్టన్ స్పందిస్తూ, దీనిపై ఎలా స్పందించాలో తనకు తెలియడం లేదు కానీ, లులూను అతనెంతగా ప్రేమించాడో దీన్ని బట్టి అర్థమవుతోందని వెల్లడించింది. కాగా, స్నేహితులు అందించిన సమాచారం ప్రకారం బిల్ డోరిస్ రియల్ ఎస్టేట్ రంగంలో వాటాలు, పెట్టుబడుల రూపంలో పెద్ద మొత్తంలో సంపదకు అధిపతి అని తెలుస్తోంది.