వనజీవి రామయ్యకి అస్వస్థత.. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స

  • గత కొంత కాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న రామయ్య
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలింపు
  • గతంలో రామయ్యకు జరిగిన గుండె సంబంధిత శస్త్ర చికిత్స
ప్రముఖ సామాజిక సేవకుడు, వనజీవి రామయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. రామయ్య అస్వస్థతకు గురైన వెంటనే తొలుత ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు.

గతంలో ఆయనకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. రామయ్య, ఆయన భార్య తమ జీవితాలను మొత్తం మొక్కలు నాటడానికే కేటాయించారు. సమాజం కోసం ఆయన చేస్తున్న సేవలకు గుర్తించిన కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని పర్యావరణ ప్రేమికులు, అభిమానులు కోరుకుంటున్నారు.


More Telugu News