ఇంగ్లండ్ టాప్ ఆర్డ‌ర్ వెన్ను విరిచిన టీమిండియా బౌల‌ర్లు.. ఆదిలోనే 4 వికెట్లు కోల్పోయిన వైనం

  • 39 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
  • అశ్విన్‌కు 2, ఇషాంత్ శ‌ర్మ, అక్స‌ర్ ప‌టేల్‌కు చెరో వికెట్
  • తొలి ఇన్నింగ్స్ లో 329 ప‌రుగుల‌కు భార‌త్ ఆలౌట్  
చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సు ఆట‌లో టీమిండియా బౌల‌ర్లు ఇంగ్లండ్ టాప్ ఆర్డ‌ర్ వెన్ను విరిచారు. కేవ‌లం 39 ప‌రుగుల‌కే ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ భార‌త బౌల‌ర్ల ధాటికి వెనువెంట‌నే వెనుదిరిగారు. ఓపెన‌ర్ రోరీ బ‌ర్న్స్ డ‌కౌట్ కాగా, సిబ్లీ 16, లారెన్స్ 9, కెప్టెన్ రూట్ 6 ప‌రుగుల‌కే ఔట‌య్యారు. బెన్ స్టోక్స్‌ ఎనిమిది ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. భోజ‌న విరామ స‌మ‌యానికి ఆస్ట్రేలియా స్కోరు 18 ఓవ‌ర్ల‌కు 39/4 గా ఉంది. భార‌త బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌కు 2, ఇషాంత్ శ‌ర్మ, అక్స‌ర్ ప‌టేల్‌కు చెరో వికెట్ ద‌క్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 290 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.


More Telugu News