ఢిల్లీ వెళ్లివచ్చాక విశాఖ ఉక్కు ప్లాంట్‌పై పవన్ తీరు మారింది: బీవీ రాఘవులు
- ప్రైవేటీకరణ కాకుండా పవన్ పోరాడాలి
- ఆ ప్లాంటును కార్పొరేట్‌కు కట్టబట్టే యత్నాలు
- ప్రైవేటీకరణ నిర్ణయం చాలా ప్రమాదకరం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలోని పార్టీలు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనలు తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఏపీలో బీజేపీతో కలిసిన జనసేన పార్టీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని సీపీఎం నేత బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గతంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.
అయితే, ఆయన ఢిల్లీ వెళ్లగానే ధోరణి మారిందని, ఆయన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పారు. విశాఖ ఉక్కును ఇనుప తుక్కుగా మార్చాలని, ఆ ప్లాంటును పారిశ్రామిక వర్గాలకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం చాలా ప్రమాదకరమని మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయం ఏపీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు.