నా వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరోయిన్ శ్రుతిహాసన్
- నాలుగేళ్ల క్రితం ట్వీట్ చేశాను
- కన్నడ సినిమా చేసే అవకాశాలు లేవన్నాను
- ఇప్పుడు సలార్‌లో నటిస్తున్నాను
- అప్పట్లో బిజీగా ఉండడంతోనే కన్నడలో నటించలేదు
నాలుగేళ్ల క్రితం తాను ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపింది. కన్నడ సినిమా చేసే అవకాశాలు లేవంటూ 2017లో ఆమె చెప్పింది. అప్పట్లోనూ దానిపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఆ ట్వీట్ మరోసారి తెరపైకి వచ్చింది.
ఎందుకంటే, కన్నడ సినీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా రూపొందిస్తోన్న ‘సలార్’లో ఆమె నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పట్లో కన్నడపై గౌరవం లేకుండా ట్వీట్ చేసిందని, ఇప్పుడు కన్నడ సినీ దర్శకుడి సినిమాలో నటిస్తోందని ఎద్దేవా చేస్తున్నారు.
దీనిపై శ్రుతిహాసన్ స్పందిస్తూ... కన్నడ సినీ పరిశ్రమలో భాగం కావడం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. సలార్ సినీ బృందం చాలా ప్రత్యేకమైనదని తెలిపింది. అప్పట్లో తాను ఓ కన్నడ సినిమా చేయాల్సి ఉందని, అయితే, బిజీగా ఉండడంతో డేట్స్ కుదరకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది.
అయితే, సలార్ కథ, పాత్ర తనకెంతో నచ్చాయని, ఆ సినీ యూనిట్ కూడా నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్ కు అంగీకరించానని తెలిపింది. 2017లో తాను చేసిన ఓ ట్వీట్‌ను మాత్రం అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తనకు ప్రతి సినీ పరిశ్రమ, దర్శకులు, నిర్మాతలు, నటీనటుల పట్ల గౌరవం ఉందని వ్యాఖ్యానించింది.