మీడియాతో మాట్లాడుకోవచ్చు.. ఎస్ఈసీ గురించి మాత్రం మాట్లాడకూడదు: కొడాలి నాని కేసులో హైకోర్టు

  • ప్రభుత్వ పథకాల గురించి మీడియాతో మాట్లాడవచ్చు
  • ఎస్ఈసీ, ఎన్నికల కమిషనర్ గురించి మాట్లాడకూడదు
  • ఎన్నికల ప్రక్రియపై కూడా మాట్లాడకూడదు
ఏపీ హైకోర్టులో మంత్రి కొడాలి నానికి కొంతమేర ఊరట లభించింది. మీడియాతో మాట్లాడకూడదంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను కొడాలి నాని హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు... తీర్పును ఈరోజుకు రిజర్వ్ చేసింది.

 కాసేపటి క్రితం తీర్పును వెలువరిస్తూ... ప్రభుత్వ పథకాల గురించి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని తెలిపింది. అయితే, ఎస్ఈసీ గురించి కానీ, ఎన్నికల కమిషనర్ గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియపై కూడా మాట్లాడకూడదని సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది. 


More Telugu News