జీన్స్ లు, టీషర్టులు ధరించి రోడ్లుపై అమ్మాయిల విరాళాల పర్వం... ఇవ్వకపోతే తిట్ల వర్షమే!

  • గుంటూరు జిల్లాలో కనిపిస్తున్న దృశ్యం
  • రోజుకో రోడ్డుపై విరాళాల సేకరణ
  • ప్రకృతి విపత్తు బాధితుల కోసమని వెల్లడి
  • విరాళాలు ఇవ్వని వారిని హిందీలో తిడుతున్న వైనం
ఇటీవల గుంటూరు జిల్లాలో పలు రోడ్లపై ఓ కొత్త దృశ్యం కనిపిస్తోంది. జీన్స్ లు, టీషర్టులు ధరించిన అమ్మాయిలు రోడ్లపై వెళ్లేవారిని ఆపి విరాళాలు వసూలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అంటూ విరాళాల వసూలుకు కారణం చెబుతున్నారు.

అంతవరకు బాగానే ఉంది.... విరాళాలు ఇస్తే సరి, ఇవ్వకపోతే మాత్రం హిందీలో తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు. దాంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా గుంటూరు-ప్రత్తిపాడు రహదారిలో ఈ అమ్మాయిలు విరాళాలు వసూలు చేశారు. అయితే, ఏ సంస్థ తరఫున తాము విరాళాలు వసూలు చేస్తున్నది వారు వెల్లడించడంలేదు.


More Telugu News