మయన్మార్‌లో కొనసాగుతున్న నిరసన.. సైన్యం కాల్పుల్లో 10 మంది మృతి
- వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న ప్రజలు
- ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులు
- గాయపడిన వారిలో చిన్నారులు
మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్న సైన్యం నేడు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 30కి పెరిగింది. మయన్మార్‌లో పాలనను సైన్యం హస్తగతం చేసుకున్న తర్వాత గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.
ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న సైన్యం నేడు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే టియర్ గ్యాస్ ప్రయోగించింది. అనంతరం కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలోని అతిపెద్ద నగరాలైన యాంగూన్, మాండలే సహా పలు నగరాల్లో సైన్యం కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా పేర్కొంది.