బాక్సింగ్ టోర్నీలో పతకాన్ని ఖాయం చేసుకున్న మేరీ కోమ్
- ఏడాది తరువాత బాక్సింగ్ బరిలోకి
- స్పెయిన్ లో బాక్సమ్ ఓపెన్ టోర్నీ
- 51 కిలోల విభాగంలో ఆడుతున్న మేరీ కోమ్
ఇండియన్ లేడీ బాక్సర్ మేరీ కోమ్, దాదాపు ఏడాది తరువాత బరిలోకి దిగిన తొలి ఇంటర్నేషనల్ టోర్నీలో పతకాన్ని ఖాయం చేసుకుంది. బాక్సమ్ ఓపెన్ టోర్నీ స్పెయిన్ లోని కాస్టెలాన్ లో జరుగుతుండగా, 51 కిలోల విభాగంలో బరిలోకి దిగిన మేరీ కోమ్, క్వార్టర్ ఫైనల్ లో ఇటలీకి చెందిన జియోర్దానా సొరెన్ టినోపై విజయం సాధించి సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది.
దీంతో ఈ టోర్నీలో ఇండియాకు ఓ పతకం ఖాయమైంది. ఆదివారం నాడు జరిగే సెమీ ఫైనల్ లో యూఎస్ కు చెందిన వర్జీనియాతో మేరీకోమ్ తలపడనుంది. ఇతర మ్యాచ్ లలో 63 కిలోల విభాగంలో మనీశ్ క్వార్టర్ ఫైనల్ కు చేరాడు.
దీంతో ఈ టోర్నీలో ఇండియాకు ఓ పతకం ఖాయమైంది. ఆదివారం నాడు జరిగే సెమీ ఫైనల్ లో యూఎస్ కు చెందిన వర్జీనియాతో మేరీకోమ్ తలపడనుంది. ఇతర మ్యాచ్ లలో 63 కిలోల విభాగంలో మనీశ్ క్వార్టర్ ఫైనల్ కు చేరాడు.