రిలయన్స్ ఉద్యోగులు, వారి పిల్లలు, తల్లిదండ్రులకు ఉచితంగా టీకాలు!

  • టీకాను ఉచితంగా పంపిణీ చేస్తాం
  • అందరూ పేర్లు నమోదు చేయించుకోండి
  • ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్ లో నీతా
పెట్రో కెమికల్స్ నుంచి టెలికం వరకూ పలు రంగాల్లో విస్తరించిన రిలయన్స్, తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి పిల్లలు, తల్లిదండ్రులకు బంపరాఫర్ ఇచ్చింది. ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ఊపందుకున్న వేళ, అందరు ఉద్యోగులు, వారి కుటుంబీకులకు సంస్థ ఉచితంగా టీకాను అందిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్ పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. అందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతూ ఓ ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపారు.

తమ ఉద్యోగుల ఆరోగ్యం, సంతోషం తమకెంతో ముఖ్యమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన ఆమె, కరోనా మార్గదర్శకాలను అందరూ పాటించాలని అన్నారు. ఇదిలావుండగా, గత సంవత్సరం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలు ప్రకటించిన సంగతి తెలిసిందే.


More Telugu News