టర్కీ సరస్సులో అంగారుకుడి జీవం గుట్టు!

  • శాల్దాలో సూక్ష్మజీవులతో ఏర్పడిన రాతి నిక్షేపాలు
  • మార్స్ పై జెజెరో లోయలోనూ అలాంటివే
  • ఆ శాంపిళ్లతో శాల్డా నిక్షేపాలను పోల్చనున్న నాసా
అంగారక గ్రహంపై జీవం గుట్టును తెలుసుకునేందుకు కొన్ని రోజుల క్రితం నాసా పర్సెవరెన్స్ రోవర్ ను పంపించింది. జెజెరో లోయలో ఆ ఆనవాళ్లను కనిపెట్టనుంది. ప్రస్తుతం రోవర్ ను అక్కడ టెస్ట్ చేస్తోంది. అయితే, కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుడి జీవం గుట్టు.. మన భూమిపైనే ఉందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.

టర్కీలోని శాల్దా సరస్సులో జీవం మూలాలకు సంబంధించిన రహస్యం ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. జెజెరో లోయలోని సున్నపు రాతి నిక్షేపాలు, లోహాలు.. శాల్దా సరస్సులోని రాతి నిక్షేపాలు ఒకేలాంటివని అంటున్నారు. సూక్ష్మజీవులతో ఏర్పడిన ఆ సున్నపు రాతి నిక్షేపాలు శాల్దా సరస్సులో పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు.

జెజెరో లోయలో ఉన్నవి శాల్దాలో ఏర్పడిన రాతి నిక్షేపాల్లాంటివేనా? కాదా? అన్న విషయాన్ని గుర్తించే పనిలో పడింది పర్సెవరెన్స్ ను మార్స్ పైకి పంపిన శాస్త్రవేత్తల బృందం. ఆ లోయ అంచుల్లో గుర్తించిన కార్బన్ డయాక్సైడ్, నీటితో ఏర్పడిన కార్బొనేట్ మినరల్స్ ను శాల్దాలో ఏర్పడిన రాతి నిక్షేపాలతో పోల్చి చూడనుంది.


More Telugu News