సింహాచలం క్షేత్రంలో సందడి చేసిన మంచు విష్ణు, నవదీప్

  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో మోసగాళ్లు చిత్రం
  • మార్చి 19న రిలీజ్
  • ప్రమోషన్ కార్యక్రమాలతో చిత్రబృందం బిజీ
  • సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేసిన నటులు 
ఓ భారీ ఐటీ కుంభకోణం ఆధారంగా రూపుదిద్దుకున్న మోసగాళ్లు చిత్రం మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు హీరో కాగా, ఆయన సోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది.

ఈ క్రమంలో మంచు విష్ణు, నటుడు నవదీప్ సింహాచలం నరసింహస్వామి ఆలయానికి విచ్చేశారు. మోసగాళ్లు చిత్రం విజయవంతం కావాలంటూ సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. మంచు విష్ణు, నవదీప్ లను చూసేందుకు భారీగా తరలిరావడంతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అంతకుముందు, మంచు విష్ణు, నవదీప్ లకు ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి.

మోసగాళ్లు చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలకపాత్రలో కనిపిస్తారు. రుహీ సింగ్, నవీన్ చంద్ర, కర్మ మెక్ కెయిన్ తదితరులు ఇతర పాత్రధారులు.


More Telugu News