స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు బరితెగించిపోయాడు: విజయసాయిరెడ్డి
- చంద్రబాబుపై విజయసాయి విమర్శలు
- చంద్రబాబు నేడు అనామకుడిలా మారిపోయాడని వ్యాఖ్యలు
- తన పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నాడని కామెంట్
- అందుకే జగన్ ను తిడుతున్నాడని ఆరోపణ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు బరితెగించిపోయాడని విమర్శించారు. ఒకప్పుడు తిమ్మిని బమ్మిని చేస్తూ రాష్ట్రాన్ని శాసించిన చంద్రబాబు, ఇవాళ తనొక అనామకుడిలా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. అందుకే జగన్ ను దుర్భాషలాడాడని, అయితే జగన్ హుందాగా వ్యవహరించి, తీర్పు చెప్పే అవకాశాన్ని ప్రజలకే వదిలేశారని పేర్కొన్నారు. దాంతో ప్రజలు పచ్చ పార్టీని 10 మైళ్ల లోతున పాతిపెట్టారని విజయసాయి ఎద్దేవా చేశారు.
అటు సీఎం జగన్ పైనా ప్రశంసలు కురిపించారు. సేవ చేసేందుకే రాజకీయ పార్టీలు స్థాపిస్తుంటారని, అయితే ప్రజావిశ్వాసం చూరగొని అధికారంలోకి రాగలిగితేనే ఆపన్నులను ఆదుకునే అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. చాలామంది గెలిచాక చేద్దాం, చూద్దాం అనుకుంటుంటారని, కానీ 20 నెలల్లో రూ.80 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేయడం జగన్ కు మాత్రమే సాధ్యమైందని కొనియాడారు.