విశాఖ వైసీపీ కార్పొరేటర్ సూర్యకుమారి‌ మృతి

  • ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన సూర్యకుమారి
  • ఇండస్ట్రియల్ ఏరియాలోని నివాసంలో నిన్న రాత్రి మృతి
  • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విశాఖ వైసీపీ శిబిరంలో విషాదం నెలకొంది. 61వ వార్డు కార్పొరేటర్ సూర్యకుమారి ఆకస్మికంగా మృతి చెందారు. విశాఖ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్న ఆమె... తన నివాసంలోనే నిన్న రాత్రి మరణించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృత దేహాన్ని ఆసుపత్రికి  తరలించారు. అయితే ఆమె మృతిపై కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆమె అనారోగ్యం కారణంగా మృతి చెందారా? లేక హత్యకు గురయ్యారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమె వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆమె మృతి పట్ల వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.



More Telugu News