తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై హత్యాయత్నం జరగలేదు: పోలీసులు
- సుజిత్ రావణ్ అందరినీ తప్పుదోవ పట్టించాడు
- బైకుపై వెళ్తున్న సమయంలో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ప్రమాదం
- బైక్ అదుపుతప్పి డివైడర్‌పైన పడింది
- అక్కడి ఇనుప చువ్వ ఆయన ఛాతీ కింది భాగంలోకి దిగింది
హైదరాబాద్‌లో తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై హత్యాయత్నం జరిగిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పంజాగుట్ట పోలీసులు స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. సుజిత్ రావణ్ అందరినీ తప్పుదోవ పట్టించేలా తనపై దాడి జరిగిందని చెప్పాడని వివరించారు.
గత అర్ధ రాత్రి సుజిత్ బైకుపై బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌పైన పడడంతో అక్కడి ఇనుప చువ్వ ఆయన ఛాతీ కింది భాగంలోకి దిగిందని పోలీసులు వివరించారు.
ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ఆయనకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోందని చెప్పారు. అయితే, దుండగులు తనపై కత్తులతో దాడి చేసి అనంతరం స్కార్పియో వాహనంలో పారిపోయారంటూ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా ఆయన అబద్ధాలు చెప్పారని నిర్ధారణ అయింది.