కేరళ ఎన్నికల్లో చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన ట్రాన్స్‌జెండర్ అనన్య

  • వెంగర నియోజకవర్గం నుంచి బరిలోకి
  • ఆమె ప్రత్యర్థిగా సీనియర్ నేత కన్హలికుట్టి
  • 'ట్రాన్స్‌జెండర్ రేడియో జాకీ'గా అనన్యకు గుర్తింపు
అనన్య కుమారి అలెక్స్.. కేరళ ఎన్నికల్లో చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. కారణం ఆమె 28 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ కావడమే. వెంగర నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) అభ్యర్థి పీకే కున్హలికుట్టిపై డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల గుర్తు ‘టీవీ’. కేరళలోని తొలి ఎఫ్ఎమ్ ట్రాన్స్‌జెండర్ రేడియో జాకీగా అనన్య గుర్తింపు పొందారు.

కొల్లాం ప్రాంతానికి చెందిన అనన్య ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్బంగా అనన్య మాట్లాడుతూ ఇతర మహిళలు, పురుషులకు మల్లే తమకు కూడా పూర్తి శక్తిసామర్థ్యాలు ఉన్నాయని అన్నారు. తమపై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఇతరుల్లాగే తమకు గౌరవం ఇస్తే చాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ఆమె ప్రత్యర్థి కున్హలికుట్టి కుట్టి స్వాగతించారు.


More Telugu News