నాపై ఆరోపణల మీద రిటైర్డ్​ జడ్జితో విచారణ సిద్ధం: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​ దేశ్​ ముఖ్​

  • నిజానిజాలు తేల్చాల్సిందిగా సీఎంను కోరానని వెల్లడి
  • జ్యుడీషియల్ ఎంక్వైరీకి నిర్ణయించారని కామెంట్
  • పరంబీర్ పై పరువు నష్టం దావా వేస్తానన్న మంత్రి
తనపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించేందుకు తాను సిద్ధమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి గురవారమే లేఖ రాసిన ఆయన.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూళ్లు చేయాలన్న టార్గెట్ ను సచిన్ వాజేకి మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పెట్టారని పరంబీర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

తనపై అకారణంగా నిందలను వేస్తున్నారని అనిల్ దేశ్ ముఖ్ అన్నారు. పరంబీర్ సింగ్ పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. నిజానిజాలు తేల్చాల్సిందిగా సీఎంకు విజ్ఞప్తి చేశానని చెప్పారు. ఆయన అతి త్వరలోనే జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తారన్నారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సీఎం నిర్ణయించారని తెలిపారు. కాగా, అనిల్ దేశ్ ముఖ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయబోరని గతంలోనే శరద్ పవార్ చెప్పిన సంగతి తెలిసిందే.


More Telugu News