పదేళ్లలో చేయలేని పనిని 100 రోజుల్లో చేసి చూపిస్తా: కమలహాసన్ హామీ
- కోయంబత్తూరులో కమల్ విస్తృత పర్యటన
- కోయంబత్తూరును ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతానని హామీ
- కమల్‌కు మద్దతుగా సుహాసిని ప్రచారం
త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు కనుక అధికారమిస్తే గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనిని తాను వంద రోజుల్లో చేసి చూపిస్తానని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమలహాసన్ హామీ ఇచ్చారు. కోయంబత్తూరు సౌత్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కమల్.. నిన్న తన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు.
చిన్నచిన్న వీధుల్లోకి సైతం వెళ్లి ప్రచారం చేశారు. ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడారు. తనకు కనుక అధికారమిచ్చి అండగా నిలిస్తే పాలకులు ఈ పదేళ్లలో చేయలేని పనిని కేవలం వంద రోజుల్లో చేసి చూపిస్తానని, రాష్ట్రం రూపురేఖల్ని సమూలంగా మార్చివేస్తానని అన్నారు. కోయంబత్తూరును దేశంలోనే ఆదర్శనగరంగా మారుస్తానని హామీ ఇచ్చారు.
మరోవైపు, కమల్‌కు మద్దతుగా ప్రముఖ సినీనటి, కమల్ సోదరుడు చారుహాసన్ కుమార్తె సుహాసిని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఎక్కడికక్కడ ఓటర్లతో మాట్లాడుతూ, ఓపిగ్గా సమస్యలు వింటూ ప్రచారం నిర్వహించారు. కమల్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు.