బైక్‌పై వచ్చి నందిగ్రామ్‌లో ఓటేసిన సువేందు అధికారి
- నందిగ్రామ్‌లో జోరుగా పోలింగ్
- రెండో విడతలో 30 స్థానాలకు పోలింగ్
- బరిలో 171 మంది అభ్యర్థులు
- అసోంలో 39 స్థానాలకు పోలింగ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 171 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత సువేందు అధికారి ముఖాముఖి తలపడుతున్న నందిగ్రామ్‌లోనూ నేడే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇక్కడే కేంద్రీకృతమై ఉంది.
బీజేపీ అభ్యర్థి సువేందు ఈ ఉదయమే ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బైక్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సువేందు బూత్ నంబరు 76లో తన ఓటు వేశారు. మరోవైపు, అసోంలోనూ రెండో విడత ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం మొదలైంది. 14 జిల్లాల్లోని 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత నెల 27న ఇక్కడ జరిగిన తొలి విడత పోలింగులో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం గమనార్హం.