ఈ ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా!

  • గత సంవత్సరం కరోనాతో వాయిదా
  • త్వరలో మరోమారు లాక్ డౌన్ పెట్టే చాన్స్
  • మే 23 నుంచి జరగాల్సిన పోటీలు
ఈ సంవత్సరం మే 23 నుంచి షెడ్యూల్ చేసిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పోటీలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన ఆ దేశ క్రీడా శాఖా మంత్రి రోక్సానా మరాసినే, కరోనా కేసులు గణనీయంగా పెరుగుతూ ఉండటమే దీనికి కారణమని అన్నారు. గత సంవత్సరం కరోనా, లాక్ డౌన్ కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి నెలకొని వుందని ఆమె వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ లో వస్తున్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో,  ఇప్పటికే రెండు సార్లు లాక్ డౌన్ విధించిన ఫ్రాన్స్ సర్కారు, మూడోసారి లాక్ డౌన్ దిశగా యోచిస్తోంది. వివిధ దేశాల నుంచి దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు, అభిమానులు హాజరయ్యే ఈ టోర్నీని వాయిదా వేయడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


More Telugu News