ప్రకాశ్ రాజ్ వంటి సత్తా ఉన్న నటుడు సినిమాలో ఉంటే ఇతర నటుల ప్రతిభ కూడా బయటికి వస్తుంది: చిరంజీవి
- వకీల్ సాబ్ లో అడ్వొకేట్ నందాగా ప్రకాశ్ రాజ్
- పవన్, ప్రకాశ్ రాజ్ మధ్య కోర్ట్ సీన్
- ప్రకాశ్ రాజ్ నటనకు చిరంజీవి ఫిదా
- అద్భుతంగా నటించాడంటూ కితాబు
పవన్ కల్యాణ్ ప్రధానపాత్ర పోషించిన వకీల్ సాబ్ చిత్రంలో నటుడు ప్రకాశ్ రాజ్ పాత్రకు కూడా మంచి మార్కులే పడ్డాయి. కోర్ట్ రూమ్ డ్రామాలో న్యాయవాది నందాగా ఆయన పవన్ కల్యాణ్ కు దీటుగా నటించారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వకీల్ సాబ్ లో తనదైన శైలిలో నటించిన ప్రకాశ్ రాజ్ కు ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
ప్రకాశ్ రాజ్ వంటి సత్తా ఉన్న నటుడు సినిమాలో ఉంటే, ఇతర నటుల ప్రతిభ కూడా బయటికి వస్తుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రకాశ్ రాజ్ తో పోటాపోటీగా నటించాలన్న తపనతో ఇతర నటులు కూడా తమ శక్తిమేర నటించేందుకు ప్రయత్నిస్తారని వివరించారు. వకీల్ సాబ్ చిత్రంలో ప్రకాశ్ రాజ్ అద్భుతంగా నటించారని, పవన్ కల్యాణ్ కు దీటుగా తన పాత్రను రక్తి కట్టించారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాగే అలరించాలని ఆకాంక్షించారు.