ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఇలా.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
- 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి ఫీజుల ఖరారు
- వార్షిక ఫీజులోనే మిగతా ఫీజులు
- నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై చర్యలు
రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి ఈ ఫీజులు వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. వీటితోపాటు సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లోని పీజీ కోర్సులకు కూడా ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది.
మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు రూ. 27 వేలు, కెమిస్ట్రీకి రూ. 33 వేలు, బయోటెక్నాలజీకి రూ. 37,400, కంప్యూటర్ అప్లికేషన్స్‌కు రూ. 24,200, జెనెటిక్స్‌కు రూ. 49 వేలు, ఎంఏ, ఎంకామ్‌కు రూ. 15 వేల నుంచి రూ. 30 వేలుగా ఫీజులను నిర్ధారించింది. వార్షిక ఫీజులోనే ట్యూషన్, అఫిలియేషన్, ఐడీకార్డు, స్టడీ టూర్ ఫీజులు కలిసి ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేసే కాలేజీలపై చర్యలు తప్పవని హెచ్చరించింది.