తిరుమలలో తగ్గిన రద్దీ... కేవలం 25 వేల మంది దర్శనం!
- గురువారం హుండీ ద్వారా రూ. 2.10 కోట్ల ఆదాయం
- రూ. 300 టికెట్లున్న వారికే దర్శనం
- వైరస్ భయంతో భక్తులు దూరం
ఒకప్పుడు రోజుకు దాదాపు లక్ష మంది వరకూ దర్శనం చేసుకునే తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో రద్దీ భారీగా తగ్గపోయింది. గరువారం నాడు స్వామిని కేవలం 25,625 మంది మాత్రమే దర్శించుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన టీటీడీ వర్గాలు, హుండీ ద్వారా రూ. 2,10 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. 13,344 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారని తెలిపారు.
కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, టైమ్ స్లాట్ దర్శనాన్ని టీటీడీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ. 300 దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారిలోనూ పలువురు వైరస్ భయంతో దర్శనానికి రావడం లేదని తెలుస్తోంది.