వ్యాక్సిన్ వేయించుకుంటే ఉచితాలు, రాయితీలు ప్రకటించిన చైనా.... అయినా ముందుకు రాని జనాలు!

  • కరోనాకు జన్మస్థానంగా చైనాకు గుర్తింపు
  • వ్యాక్సిన్ తీసుకువచ్చిన చైనా
  • టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపని చైనీయులు
  • గుడ్లు, కూపన్లు ఇస్తామన్నా కనిపించని స్పందన
చైనాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ భూతానికి జన్మస్థానంగా చెడ్డపేరు తెచ్చుకున్న చైనా... తర్వాత కాలంలో కరోనాను సమర్థంగానే కట్టడి చేయగలిగింది. అయితే, తీరా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక చైనా ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. వ్యాక్సిన్లు వేయించుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో ప్రజలను ఆకర్షించేందుకు చైనా ఆఫర్లు ప్రకటిస్తోంది.

వ్యాక్సిన్ తీసుకున్నవారికి 3 కిలోల గుడ్లు ఉచితం అని, సూపర్ మార్కెట్ షాపింగ్ కూపన్లు ఫ్రీ అని ఊరిస్తోంది. రేషన్ సరకులపై రాయితీలు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ జనాల్లో ఆశించిన మేర స్పందన రావడంలేదు. సుమారు 140 కోట్ల జనాభా కలిగిన చైనాలో ఇప్పటివరరకు టీకా వేయించుకుంది 19 కోట్ల మందేనట. దాంతో మిగతావారిని ఎలా వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకురావాలో అర్థంకాక అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంటోంది!


More Telugu News