ప్రభాస్ కోసం వెండితెరపై కొత్త ప్రపంచం సృష్టిస్తారట!
- ఇలాంటి పాయింటును ఎవరూ టచ్ చేయలేదు
- తెరపై ప్రతీదీ కొత్తగా కనిపిస్తుంది
- ప్రభాస్ కెరియర్లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ .. వరుసగా ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులను ఒప్పుకుంటూ వెళుతున్నాడు. 'రాధేశ్యామ్' చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఇక 'సలార్' .. 'ఆది పురుష్' రెండూ కూడా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లాయి. ఈ రెండు సినిమాల తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్టునే ప్రభాస్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన పనుల్లోనే నాగ్ అశ్విన్ ఉన్నాడు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు.
"ప్రభాస్ ఇంతవరకూ చేసిన సినిమాలు వేరు .. ఈ కథ వేరు. సోషియో ఫాంటసీతో కూడిన సైంటిఫిక్ మూవీ ఇది. ఇంతవరకూ ఎవరూ కూడా ఈ తరహా పాయింటును టచ్ చేయలేదు. ఈ సినిమా కోసం ప్రపంచస్థాయి సెట్స్ ను సిద్ధం చేయించనున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నాం. ప్రేక్షకులకు తెరపై ప్రతీదీ కొత్తగా కనిపిస్తుంది. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా కోసం ఎక్కువ కాలాన్ని వెచ్చించవలసి వచ్చినందుకు నేను బాధపడటం లేదు. ఇంత గొప్ప ప్రాజెక్టును చేస్తున్నందుకు ఆనందిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.