సంగం డెయిరీ కేసు: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ధూళిపాళ్ల నరేంద్ర

  • 2010 నుంచి సంగం డెయిరీ చైర్మన్ గా ధూళిపాళ్ల
  • సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు
  • ధూళిపాళ్లను అరెస్ట్ చేసిన ఏసీబీ
  • హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ నేత
  • విచారణ రేపటికి వాయిదా
గుంటూరు జిల్లా సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏసీబీ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ధూళిపాళ్ల తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన నేడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శంతన్ గౌడర్ మరణం నేపథ్యంలో ఈ మధ్యాహ్నం నుంచి హైకోర్టులో కార్యకలాపాలు రద్దు చేశారు. తిరిగి హైకోర్టులో రేపటి నుంచి కార్యకలాపాలు చేపట్టనున్నారు.

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 2010 నుంచి సంగం డెయిరీకి చైర్మన్ గా ఉన్నారు. సంగం డెయిరీలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు రావడంతో ఆయనపై పలు సెక్షన్లతో కేసు నమోదైంది. ధూళిపాళ్ల అర్ధాంగికి కూడా సీఆర్పీసీ సెక్షన్ 50 (2) కింద నోటీసులు జారీ చేశారు.


More Telugu News