దీనిపై దేశవ్యాప్త చర్చ జరగాలి: వర్ల రామయ్య
- ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలన్న దానిపై చర్చ జరగాలి
- 7వ తారీఖున కోర్టుకు హాజరు కావాలనే ఆదేశాలపై కూడా..
- అధికారంలో ఉన్న నిందితుని అధికారం కోర్టుల విచారణకు అడ్డుకారాదు
- ముద్దాయిలపట్ల న్యాయస్థానాలు వివక్ష చూపించడం మంచిది కాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) న్యాయస్థానం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘరామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు జగన్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ ట్వీట్ చేశారు.
'ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలని, అయన 7 వ తారీఖున సీబీఐ కోర్టుకు హాజరు కావాలనే ఆదేశాలపై దేశవ్యాప్త చర్చ జరగాలి. అధికారంలో ఉన్న నిందితుని అధికారం కోర్టుల విచారణకు అడ్డుకారాదు, దానికి ప్రాధాన్యత ఇచ్చి ముద్దాయిలపట్ల న్యాయస్థానాలు వివక్ష చూపించడం మంచిది కాదు. దేశవ్యాప్త చర్చ జరగాలి' అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.