తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 32 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 30 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6.60 శాతం లాభపడ్డ బజాజ్ ఫిన్ సర్వ్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను చవిచూశాయి. ఎఫ్ అండ్ ఓల ముగింపుతో పాటు, కరోనా కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 49,766కి చేరుకుంది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 14,895 వద్ద స్థిరపడింది. మెటల్ సూచీ అత్యధికంగా 5.23 శాతం లాభపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (6.60%), బజాజ్ ఫైనాన్స్ (3.89%), యాక్సిస్ బ్యాంక్ (1.65%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.36%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.29%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.76%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.52%), బజాజ్ ఆటో (-1.44%), ఎల్ అండ్ టీ (-1.20%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.11%).