వచ్చే నెల నుంచి భారత్‌లో ప్రజలకు అందుబాటులోకి స్పుత్నిక్‌-వీ టీకా!

  • భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • టీకా ఒక్కటే మార్గమంటున్న నిపుణులు
  • వేధిస్తోన్న టీకాల కొరత
  • ఈ తరుణంలో స్పుత్నిక్‌ అందుబాటులోకి
  • వెల్లడించిన రష్యాలోని భారత రాయబారి
వచ్చే నెల నుంచి భారత్‌లో మరో టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబారి బాల వెంకటేశ్‌ వర్మ సైతం ధ్రువీకరించారు. భారత్‌లో వచ్చే నెల నుంచి స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారని గురువారం తెలిపారు.

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఈ వార్త రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహమ్మారి నియంత్రణకు వ్యాక్సిన్‌ ఒక్కటే తారకమంత్రం అంటున్న తరుణంలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం నిజంగా శుభవార్త అనే చెప్పాలి. స్పుత్నిక్‌-వీ అత్యవసర వినియోగానికి ఈ నెల 12న డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రపంచంలో స్పుత్నిక్‌ వినియోగాన్ని ఆమోదించిన 60వ దేశం భారత్‌. రెండు డోసుల్లో ఇవ్వాల్సిన ఈ టీకాకు 91.6 శాతం సామర్థ్యం ఉన్నట్లు ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ లో ప్రచురితమైంది.


More Telugu News