తిరుమల రద్దీ స్వల్పంగా పెరిగినా... 11 వేలను తాకని భక్తుల సంఖ్య!

  • ఆదివారం 10,824 మందికి దర్శనం
  • రూ. 78 లక్షలకు పడిపోయిన హుండీ ఆదాయం
  • తలనీలాలు సమర్పించిన 5,500 మంది
గత కొన్ని రోజులతో పోలిస్తే, తిరుమలలో ఆదివారం నాడు భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ కరోనాకు ముందు కనిపించే భక్తుల సంఖ్యతో పోలిస్తే, ఇది దాదాపు 10 శాతం మాత్రమే. ఆదివారం నాడు స్వామిని 10,824 మంది దర్శించుకున్నారని, 5,503 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇక హుండీ ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది. నిన్న రూ. 78 లక్షల హుండీ ఆదాయం లభించిందని టీటీడీ పేర్కొంది. కరోనా కారణంగా తిరుమలకు వచ్చేందుకు భక్తులు సంకోచిస్తున్నారని, ముందుగా రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన వారిలో సైతం పలువురు రావడం లేదని అధికారులు తెలిపారు.


More Telugu News