రష్యా సింగిల్ డోసు స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సామర్థ్యం 79.4 శాతం!
- వెల్లడించిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్
- గమలేయా సెంటర్ ఆధ్వర్యంలో పరీక్షలు
- అన్ని కరోనా రకాలపైనా సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడి
- 28 రోజుల తర్వాత దాదాపు 80 శాతం సామర్థ్యం
స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తయారీకి నిధులు సమకూర్చిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) కీలక ప్రకటన చేసింది. తమ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కరోనా నిరోధంలో 79.4 శాతం సామర్థ్యం చూపినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ ఇచ్చిన 28 రోజుల తర్వాత చేసిన పరిశీలనలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. కొన్ని రెండు డోసుల వ్యాక్సిన్ కంటే దీని సామర్థ్యం చాలా మెరుగ్గా ఉందని అభిప్రాయపడింది.
అలాగే ఇది అన్ని రకాల కరోనా వైరస్‌లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని తెలిపింది. గమలేయా సెంటర్ నిర్వహించిన లేబోరేటరీ ప్రయోగాల్లో ఈ విషయం రుజువైనట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా టీకాల కొరత ఉన్న సమయంలో సింగిల్ డోసు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం కీలకాంశం. ఎక్కువ మందికి వేగంగా వ్యాక్సిన్ అందించే అవకాశం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 21న స్పుత్నిక్ లైట్ సామర్థ్య పరీక్షలు ప్రారంభించిన గమలేయా మొత్తం 7000 మందిపై దీన్ని ప్రయోగించింది.