జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ.. వాయిదా
- బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు పిటిషన్
- కౌంటర్ దాఖలుకు సమయం కోరిన జగన్, సీబీఐ
- విచారణను ఈ నెల 17కి వాయిదా
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను హైదరాబాద్, నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. కేసులో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని ఆయన వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది.
అయితే, కౌంటర్ దాఖలుకు కోర్టును జగన్, సీబీఐ అధికారులు సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అయితే, కౌంటర్ దాఖలుకు కోర్టును జగన్, సీబీఐ అధికారులు సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.