రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత!

  • టాంజానియా దేశస్థుల నుంచి స్వాధీనం
  • చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ చేతికి చిక్కిన నిందితులు
  • నిందితుల్లో 46 ఏళ్ల మహిళ
  • వాసన రాకుండా పొట్లాలపై మసాలాలు
చెన్నైలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్టులో 15 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  వీటిని సరఫరా చేస్తున్న ఇద్దరు టాంజానియా దేశస్థులను కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఒక 46 ఏళ్ల మహిళ కూడా ఉండడం గమనార్హం.

నిందితులు చిన్న చిన్న పొట్లాల రూపంలో హెరాయిన్‌ను ప్యాక్‌ చేశారు. వాటి నుంచి వాసన బయటకు రాకుండా కొన్ని రకాల మసాలా పొడిని చల్లినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడిన అతిపెద్ద మాదకద్రవ్యం కేసు ఇదే కావడం గమనార్హం. మహిళ వైద్య అవసరాలను సాకుగా చూపి వీసా తీసుకున్నట్లు గుర్తించారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు వారికి వీసా జారీ అయినట్లు తెలుస్తోంది. బెంగళూరుకు నేరుగా విమాన సర్వీసు లేకపోవడంతో వారు చెన్నైకి చేరుకున్నారు.


More Telugu News