దేశంలోనే తొలిసారిగా అసోంలో హిజ్రాలకు కరోనా వ్యాక్సినేషన్​

  • గువాహాటీలో ప్రారంభం
  • ఓ ఆశ్రమంలో 30 మందికి టీకాలు
  • ప్రస్తుతం గువాహాటీకే పరిమితం
  • త్వరలోనే రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లందరికీ
దేశంలోనే తొలిసారిగా హిజ్రాల కోసం అసోం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. శుక్రవారం గువాహాటీలోని ఓ షెల్టర్ హోమ్ లో 30 మంది హిజ్రాలకు వ్యాక్సిన్ వేశారు. హిజ్రాలందరికీ ప్రధాన ఆదాయ వనరు భిక్షమెత్తుకోవడమేనని, చాలా మందితో కాంటాక్ట్ కావడం వల్ల వారు కరోనా బారిన పడుతున్నారని అసోం ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్, ఆల్ అసోం ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ఫౌండర్ స్వాతి బిధాన్ బరుహా అన్నారు.

ఉపాంత పరిస్థితుల్లో బతికే హిజ్రాలకు కరోనా వ్యాక్సిన్లు అందని పరిస్థితి ఉందని, దీనిపై ఆరోగ్య శాఖకు విజ్ఞప్తి చేస్తే స్పందించి తమకు వ్యాక్సిన్లు వేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కేవలం గువాహాటీకే ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పరిమితమైందని, తొందర్లోనే రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, అసోంలో 20 వేల మంది దాకా హిజ్రాలున్నట్టు అంచనా.


More Telugu News