కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ కు భారత్ వివరణ
- వేరియంట్ల ప్రకటన అధికారం ఢిల్లీ సీఎంకు లేదని వెల్లడి
- విమానయాన విధానాలూ ఆయన చేతుల్లో ఉండవని వివరణ
- సింగపూర్ హైకమిషనర్ తీవ్రంగా స్పందించారని కామెంట్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ కు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ‘సింగపూర్ వేరియంట్’తో చాలా ప్రమాదకరమంటూ నిన్న కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మాటలకు సింగపూర్ ప్రభుత్వమూ కౌంటర్ ఇచ్చింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి అరిందమ్ బాగ్చీ స్పందించారు. సింగపూర్ హై కమిషనర్ ఇవ్వాళ ఫోన్ చేశారని చెప్పారు. సింగపూర్ వేరియంట్ అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ట్వీట్ పై తీవ్రంగా స్పందించారన్నారు.
అయితే, కరోనా వేరియంట్ల ప్రకటనగానీ, పౌర విమానయాన విధానాల విషయంలోగానీ ఢిల్లీ సీఎంకు ఎలాంటి అధికారాలూ లేవని భారత హైకమిషనర్ వివరణ ఇచ్చారని ఆయన చెప్పారు.