ఢిల్లీలో అమిత్ షాను కలిసిన రఘురామకృష్ణరాజు కుమారుడు, కుమార్తె
- ఇటీవల రఘురామకృష్ణరాజు అరెస్ట్
- నాటకీయ పరిణామాల మధ్య సుప్రీం ఆదేశాలు
- సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
- అమిత్ షాకు పరిస్థితి వివరించిన రఘురామ కుటుంబసభ్యులు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసుపై ఆయనను ఇటీవల ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా, తనను కొట్టారంటూ ఆయన ఆరోపించడంతో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రఘురామను సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయనకు నిన్న, నేడు ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.
ఈ క్రమంలో, రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. జగన్ సర్కారు తమ తండ్రిని వేధిస్తోందని, అక్రమ కేసులు నమోదు చేసిందని రఘురామ కుమారుడు భరత్, కుమార్తె ఇందు ప్రియదర్శిని ఆయనకు ఫిర్యాదు చేశారు. రాజద్రోహం కేసు వెనుక భారీ కుట్ర ఉందని వారు అమిత్ షాకు తెలిపారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.